ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆగస్టు 15నుంచి పర్యటక ప్రాంతాలను తెరుస్తాం: మంత్రి అవంతి - tourisam placses in ap

ఆగస్టు 15 నుంచి పర్యటక ప్రాంతాలను తెరుస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. సచివాలయంలో అధికారులతో సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. పర్యటక శాఖ ఆధ్వర్యంలోని హోటళ్లన్నీ అందుబాటులోకి తెస్తామని వివరించారు.

minister avanthi  srinivas
minister avanthi srinivas

By

Published : Jul 31, 2020, 3:57 PM IST

ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని పర్యటక ప్రాంతాలను తెరుస్తామని పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లోనూ ఈ తేదీ నుంచే బోట్లు తిరిగేలా చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్న హోటళ్లన్నీ తెరుస్తున్నామని వెల్లడించారు. మరో వారం రోజుల్లో అన్ని జిల్లాల్లో పర్యటకులను అనుమతిస్తామని చెప్పారు.

'ప్రసాద్ పథకం' ద్వారా సింహాచల దేవస్థానం అభివృద్ధి చేస్తామని మంత్రి వివరించారు. శ్రీశైలంలో 50 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. 4 క్రీడా వికాస కేంద్రాలను త్వరలోనే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. పివీ సింధు అకాడమీకి విశాఖలో భూములు కేటాయిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details