మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మంగళగిరి ఎన్.ఆర్.ఐ ఆసుపత్రికి తరలించారు. ఈఎస్ఐ కేసులో అరెస్టైన అచ్చెన్నాయుడు గత నెల రోజుల నుంచి గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 10 రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం వల్ల అచ్చెన్నాయుడిని కొవిడ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడిని పోలీసులు మంగళగిరి ఎన్.ఆర్.ఐ ఆసుపత్రికి తరలించారు.
అచ్చెన్నాయుడికి 26వ నెంబర్ గది కేటాయించారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో అచ్చెన్నాయుడికి వైద్యం అందిస్తున్నారు. 26వ గది వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.