శ్రీకాకుళం జిల్లా విభజన జరిగితే జిల్లాలోని పారిశ్రామిక కారిడార్లు, విశ్వవిద్యాలయం లాంటి సంస్థలన్నీ ఒకే వైపునకు వెళ్తాయని రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు నిర్మాణం అవుతోందని ఆయన వెల్లడించారు. పార్లమెంటు ప్రాతిపదికగా జిల్లాల విభజన జరిగితే విజయనగరం పార్లమెంటుకు చెందిన ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లోని పారిశ్రామిక కారిడార్లు, సంస్థలు వెళ్లిపోతాయని.. ఈ అసమానతల్ని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో భావనపాడు పోర్టు నిర్మాణం ద్వారా అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఎచ్చెర్ల, రాజాంలలోని సంస్థలను శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోకి తేవాలని సీఎంను కోరామని.. ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. జిల్లాల ఏర్పాటుపై కింజారాపు కుటుంబం ఇష్టానుసారంగా మాట్లాడుతోందని విమర్శించారు.