పంచాయతీ ఎన్నికల ఫలితాలకు మించి పరిషత్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో ప్రజలు వైకాపాకు ఘన విజయం కట్టబెట్టారన్నారు. సీఎం జగన్‌పై నమ్మకం, రెండేళ్ల పాలన, సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రజలు ఇస్తున్న తీర్పుగా భావిస్తున్నామని చెప్పారు. ఘోరంగా ఒడిపోతామని తెలిసే.. తెదేపా పోటీ చేయలేదని అన్నారు. మరోసారి ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు తాము సిద్ధమని.. తెదేపా సిద్ధంగా ఉందా అని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. తిరిగి వారందరినీ గెలిపించుకునే సత్తా అచ్చెన్నాయుడికి ఉందా అని నిలదీశారు.
ANIL KUMAR: 'పంచాయతీ ఫలితాలకు మించి పరిషత్ ఎన్నికల ఫలితాలు' - minister anil kumar latest news
పంచాయతీ ఎన్నికల ఫలితాలకు మించి పరిషత్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎం జగన్‌పై నమ్మకం, రెండేళ్ల పాలన, సంక్షేమ అభివృద్ది పథకాలపై ప్రజలు ఇస్తోన్న తీర్పుగా భావిస్తున్నామని చెప్పారు.
minister anil kumar yadav on mptc, zptc elections