ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మా నిర్ణయం తప్పని ఒప్పుకుంటాం' - three capitals for ap

తెదేపా అధినేత చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్ విసిరారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఉపఎన్నికల్లో 23 మంది గెలిస్తే మూడు రాజధానుల నిర్ణయం తప్పని ఒప్పుకుంటామని అన్నారు.

minister anil kumar yadav
minister anil kumar yadav

By

Published : Aug 3, 2020, 10:48 PM IST

మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అంటున్న చంద్రబాబు.. తన పార్టీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించాలని వైకాపా డిమాండ్ చేసింది. తిరిగి జరిగే ఎన్నికల్లో 23 ఎమ్మెల్యేలు గెలిస్తే మూడు రాజధానులు నిర్ణయం తప్పని ఒప్పుకుంటామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తమ సవాల్​కు చంద్రబాబు నాయుడు స్పందించాలని అన్నారు.

తన బినామిలకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు నష్టం వస్తుందని తెలిసి చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని ఆక్షేపించారు. రాజధానికి లక్ష కోట్లు ఖర్చు అవుతుందని..ఎక్కడనుంచి తేవాలని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం నాలుగు ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ చూస్తుంటే... చంద్రబాబు ఎందుకు అడ్డం పడుతున్నారో అర్ధం కాలేదన్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదని... ఆయన గురించి మాట్లాడం అనవసరమన్నారు.

ABOUT THE AUTHOR

...view details