ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'శ్రీశైలం ఆనకట్టకు ఎలాంటి ముప్పులేదు'

మంత్రి అనిల్​కుమార్ యాదవ్ జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను అధికారుల నుంచి తెప్పించుకున్నారు. శ్రీశైలం డ్యాం భద్రతకు ఎలాంటి ముప్పు లేదని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

minister anil

By

Published : Nov 21, 2019, 5:13 PM IST

శ్రీశైలం రిజర్వాయర్ భద్రతకు ఎటువంటి ముప్పులేదని... జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడిన మంత్రి... వారి నుంచి డ్యాం భద్రతకు సంబంధించి నివేదిక తెప్పించుకున్నారు. డ్యాం భద్రతకు సంబంధించి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యం అంటూ... కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. శ్రీశైలం ఆనకట్టకు ఎలాంటి పగుళ్లూ లేవని... డ్యాం భద్రత కోసం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు... ఇంజినీర్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details