ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేశంతో పోలిస్తే రాష్ట్రంలో కేసులు తక్కువే: మంత్రి అనిల్ - కరోనా కేసులపై మంత్రి అనిల్ కామెంట్స్

మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తున్నామని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. దేశంతో పోల్చితే కేసులు, మరణాల సంఖ్య.. రాష్ట్రంలో తక్కువే అన్నారు. కరోనా ఎవరికి సోకినా వైద్యం అందిస్తామని తెలిపారు.

anil kumar
మంత్రి అనిల్ కుమార్

By

Published : Apr 28, 2020, 1:28 PM IST

దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తున్నామని మంత్రి అనిల్ ‌కుమార్‌ తెలిపారు. దేశంతో పోల్చితే రాష్ట్రంలో అతి తక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. మరణాల సంఖ్య కూడా తక్కువగా నమోదవుతోందని చెప్పారు.

చాలామంది ప్రముఖులకూ కరోనా సోకుతోందన్న మంత్రి.... ఈ వ్యాధి ఎవరికి వచ్చినా... చిన్నా పెద్దా తేడా లేకుండా వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. పీపీఈలు, మాస్కులు, సదుపాయాలకు కొరత లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details