విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అధికారులతో మంత్రి అనిల్ కుమార్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలవరం నిర్మాణ పనులు, పునరావాసం, పరిహార ప్యాకేజీ తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు.
నిర్దేశించుకున్న సమయంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నదికి వరదలు రాకముందే ప్రాజెక్టులో పూర్తి చేయాల్సిన పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మంత్రి దిశానిర్దేశం చేశారు.