ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం ప్రాజెక్టు 35 శాతమే పూర్తయింది: మంత్రి అనిల్

దిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​ను మంత్రి అనిల్​కుమార్ యాదవ్ కలిశారు. పోలవరం నిర్మాణంలో పూర్తి స్థాయిలో కేంద్రం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి షెకావత్ సానుకూలంగా స్పందించినట్లు అనిల్​కుమార్ వెల్లడించారు.

By

Published : Dec 10, 2019, 9:23 PM IST

minister anil kumar met central minister gajendra sigh shekavath
కేంద్రమంత్రితో అనిల్​కుమార్, వైకాపా ఎంపీలు

భేటీ వివరాలు వెల్లడిస్తున్న మంత్రి అనిల్​కుమార్

పోలవరం ప్రాజెక్టు ఇప్పటివరకు 35 శాతమే పూర్తయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్ యాదవ్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కుడి, ఎడమ కాలువల నిర్మాణం జరిగిందని వెల్లడించారు. దిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​ను వైకాపా ఎంపీలతో సహా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కలిశారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణంలో పూర్తి స్థాయిలో కేంద్రం సహకరించాలని ఆయన కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.... రానున్న మూడు రోజుల్లో ప్రాజెక్టుకు మరో 1850 కోట్ల రూపాయలు విడుదల అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ విధానంతో 800 కోట్ల రూపాయలు ఆదా చేసిన విషయాన్ని కేంద్రమంత్రికి దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. ప్రాజెక్టును త్వరగా పూర్తిగా చేసేందుకు సహకరిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి అనిల్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details