ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RDS Controversy: ఆర్‌డీఎస్‌ కుడికాలువ నిర్మాణం సక్రమమే: మంత్రి అనిల్ - rayalaseema lift irrigation

సీమ ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు ఇష్టమెుచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి అనిల్ కుమార్(Minister Anil Kumar) ఆక్షేపించారు. వైఎస్ పై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం సక్రమమే అన్న ఆయన.. తెలంగాణది అనవసర రాద్ధాంతమని వ్యాఖ్యానించారు.

minister anil kumar
minister anil kumar

By

Published : Jun 28, 2021, 4:51 PM IST

ఆర్‌డీఎస్‌ (RDS) కుడికాలువ నిర్మాణం సక్రమమే అని మంత్రి అనిల్‌ కుమార్ (Minister Anil Kumar) స్పష్టం చేశారు. కుడికాలువపై తెలంగాణది అనవసర రాద్ధాంతమని వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. వైఎస్ పై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరును సస్యశ్యామలం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి (cm jagan) కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే పోతిరెడ్డిపాడును వెడల్పు చేసేందుకు కార్యచరణ చేపడుతున్నామన్నారు.

'అపెక్స్ కౌన్సిల్‌లో తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశాం. మా హక్కుగా రావాల్సిన నీటి వాటానే వాడుకుంటున్నాం. మేం అక్రమంగా ఎలాంటి ప్రాజెక్టులూ కట్టడం లేదు. పాలమూరు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులు అక్రమంగా కట్టినవే. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై కేంద్ర అపెక్స్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశాం. జల సమస్యలను సామరస్యంగానే పరిష్కరించుకుంటాం' - అనిల్ కుమార్, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details