జెరూసలేం యాత్రికులకు ఆర్థికసాయం పెంపుపైనా ప్రభుత్వాన్ని విమర్శించడం బాధాకరమని... ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ప్రభుత్వానికి మతాన్ని అంటకట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను ప్రశంసించాల్సింది పోయి... ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం దృష్టిలో ప్రతి మతం సమానమేనని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీహామీని నేరవేర్చే సంకల్పంతో... తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
యాత్రికులకు ఆర్థిక సాయం పెంపుపైనా విమర్శలా..?
ప్రభుత్వానికి మతాన్ని అంటకట్టడం ఎంత వరకు సమంజసమని ప్రతిపక్ష పార్టీల నేతలను... ఉపముఖ్యంత్రి అంజాద్ బాషా ప్రశ్నించారు. జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు నిర్ణయాన్ని తప్పుబట్టడం సరికాదని హితవుపలికారు.
ఆక్రమణలపై విచారణ..!
రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణలకు గురైన వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు... ముగ్గురు న్యాయవాదులతో ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో మదర్సాలు కొనసాగుతున్న తీరు పరిశీలించి... రాష్ట్రంలోనూ ప్రత్యేక మదర్సా బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. ఉర్దూ అకాడమీలో అక్రమాలపై విజిలెన్స్ కమిటీ విచారణ చేపట్టిందని... ప్రాథమిక సమాచారం ప్రకారం సంబంధిత సూపరింటెండెంట్‌ను విధుల నుంచి తొలగించామని చెప్పారు. పూర్తి నివేదిక అధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి : 'అలా జరగకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతా'
TAGGED:
amjad basha fire on tdp news