ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amarnath: 'ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెద్దపీట..' - వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న మంత్రి అమర్​నాథ్​

Minister Amarnath: ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెద్దపీట వేస్తున్నామని మంత్రి అమర్​నాథ్​ తెలిపారు. కాలుష్య రహిత వాహనాలతో కర్బన ఉద్గారాలు తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. రూ.32 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని వెల్లడించారు.

Minister Amarnath
మంత్రి గుడివాడ అమర్నాథ్

By

Published : Aug 5, 2022, 3:18 PM IST

Minister Amarnath: ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి.. ఏపీలో 32 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని.. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. 2025 నాటికి భారత్​లో దేశవ్యాప్తంగా 50 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తాయని ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ సర్వే అంచనా వేసినట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సంబంధిత అంశాలపై.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన వర్చువల్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. పరిశ్రమల శాఖ అధికారులు కరికాల వలెవన్, సుబ్రహ్మణ్యం, ఈడీబీ అధికారులు కూడా సమావేశానిక హాజరయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి.. కాలుష్య రహిత వాహనాల ఉత్పత్తి ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించటమే లక్ష్యమని తెలిపారు. రవాణా అనుసంధానం, మౌలిక వసతులు, సహజ, మానవ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details