తెదేపా అధినేత చంద్రబాబు సాధన దీక్ష ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. దీక్షల పేరుతో తప్పుదోవ పట్టించడాన్ని ప్రజలు గమనించారని అన్నారు. కరోనా కట్టడిలో సీఎం సమర్థంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. లోపాలు ఎత్తిచూపితే సరిదిద్దుకునేందుకు ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ఆక్సిజన్ కొరతతో ఇటీవల రాష్ట్రంలో ఎవరూ చనిపోలేదన్న ఆయన.. కొవిడ్ ఆస్పత్రుల్లో 75 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. కరోనా మృతుల వివరాలు పబ్లిక్ డొమైన్‌లో ఉంచామన్నారు.
Alla Nani: జగన్పై ద్వేషంతోనే చంద్రబాబు దీక్ష: మంత్రి ఆళ్ల నాని - minister alla nani slams chandrababu
కరోనా కట్టడిలో సీఎం జగన్ సమర్థంగా వ్యవహరిస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. దీక్షలతో పేరుతో తప్పుదోవ పట్టించడాన్ని ప్రజలు గమనించారని వ్యాఖ్యానించారు. దీక్ష ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
minister alla nani slams chandrababu