ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా వ్యాప్తి రెండో దశ నియంత్రణకు సంసిద్ధం : ఆళ్ల నాని

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రెండో దశను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ప్రజలు మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించడం ద్వారా కొవిడ్ వ్యాప్తిని నియంత్రించాలని ఆయన సూచించారు. కరోనా పరీక్షల్లో ఏపీ మెరుగ్గా ఉందని మంత్రి తెలిపారు. వర్షాలు విస్తారంగా కురుస్తుండడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

alla nani
alla nani

By

Published : Oct 19, 2020, 7:15 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశను నియంత్రించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ప్రజలు మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం ద్వారా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సచివాలయం నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్లు, వైద్యాధికారులతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అమలు, గ్రామీణ హెల్త్ క్లీనిక్​ల ఏర్పాటు, వైద్య సేవలపై మంత్రి సమీక్షించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా కరోనా పరీక్షల్లో ఏపీ మెరుగ్గా ఉందన్నారు. ఈ ఫలితాల సాకారానికి వైద్యశాఖ, రెవెన్యూ శాఖ ఇతర ప్రభుత్వ శాఖలు కీలకంగా వ్యవహరించాయని మంత్రి అభినందించారు. ప్రస్తుతం అన్ని ఆస్పత్రుల్లోనూ కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆక్సిజన్ అందుబాటులో ఉందని తెలిపారు. రాష్ట్రంలో వర్షాల రీత్యా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. జిల్లా స్థాయిలో వీటిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం కావాలని మంత్రి ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details