ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగనన్న విద్యా కానుక కిట్లు నూరుశాతం అన్ని జిల్లాలకు చేరాలి' - జగనన్న విద్యా కానుక కిట్లపై మంత్రి ఆదిమూలపు సురేష్ రివ్యూ

పాఠశాలలు ప్రారంభించే సమయానికి జగనన్న విద్యా కానుక కిట్లు అన్ని జిల్లాలకు చేరాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. జగనన్న విద్యా కానుకపై ఆయన సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు తెరిచే నాటికి కిట్లు అందుబాటులో ఉంచాలని, కిట్లు భద్రపరిచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్

By

Published : Aug 13, 2020, 7:07 PM IST

పాఠశాలలు తెరిచేనాటికి జగనన్న విద్యా కానుక కిట్లు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులను ఆదేశించారు. జగనన్న విద్యా కానుకపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఏకరూపదుస్తులు, నోట్ పుస్తకాలు, బూట్లు, బెల్టు, బ్యాగులు సిద్ధం, జిల్లాలకు ఎన్ని అందించారన్న అంశాలపై మంత్రి ఆరా తీశారు.

నోట్ పుస్తకాలు 35 శాతం, స్కూల్ బ్యాగులు 46 శాతం, బూట్లు 38 శాతం, ఇప్పటికే ఆయా జిల్లాలకు సరఫరా చేసినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి నూరు శాతం జిల్లాలకు చేరే విధంగా చూడాలని మంత్రి ఆదేశించారు. సరఫరా చేసిన కిట్లు భద్రపరిచే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం కావడంతో పాటు భద్రపరిచే గదుల్లో ఉన్న సౌకర్యాలను కూడా పరిశీలించాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఇదీ చదవండి :కరోనా నుంచి కోలుకొని కోన రఘుపతి డిశ్ఛార్జి

ABOUT THE AUTHOR

...view details