గుంటూరు నగరంలో నిర్మిస్తున్న గుర్రం జాషువా కళాప్రాంగణంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28వ తేదీన గుర్రం జాషువా జయంతి రోజు ఈ కళా ప్రాంగణం పునఃప్రారంభం చేయాలని నిర్ణయించారు. గుర్రం జాషువా జయంతి కార్యక్రమం నిర్వహించే అంశంపై, చేస్తున్న ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్లో నిర్వహించిన సమీక్షకు.. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు, అధికారులు హాజరయ్యారు.
గుర్రం జాషువా జయంతి నిర్వహణపై మంత్రి సమీక్ష - gurram jashuva birth Anniversary news
గుర్రం జాషువా జయంతి నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సమీక్ష నిర్వహించారు. గుంటూరు నగరంలో నిర్మిస్తున్న గుర్రం జాషువా కళాప్రాంగణంపై ఆరా తీశారు.
![గుర్రం జాషువా జయంతి నిర్వహణపై మంత్రి సమీక్ష Minister Adimulapu Suresh Review on Gurram Jashuva](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8908791-96-8908791-1600869060786.jpg)
గుర్రం జాషువా జయంతి నిర్వహణపై మంత్రి సమీక్ష