ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Adimulapu Suresh: అందరూ చదువుకోవాలన్న ఆశయమే... 'అమ్మఒడి' పథకం - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

Adimulapu Suresh: అందరూ చదువుకోవాలన్న ఆశయంతో 'అమ్మఒడి' పథకాన్ని సీఎం జగన్​ తీసుకొచ్చారని మంత్రి ఆదిమూలపు సరేష్​ అన్నారు. రాబోయే రోజుల్లో అవసరమైతే ల్యాప్‌టాప్‌లు సమకూర్చే ఆలోచన ఉందని ఆయన తెలిపారు. ఈ పథకం పొందడానికి అర్హతలు తప్ప ఎలాంటి ఆంక్షలు లేవని మంత్రి సురేష్‌ స్పష్టం చేశారు.

Adimulapu Suresh
మంత్రి ఆదిమూలపు సరేష్

By

Published : Apr 16, 2022, 7:51 AM IST

Adimulapu Suresh: పేద, ధనిక తేడా లేకుండా అందరూ చదువుకోవాలన్న ఆశయంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 'జగనన్న అమ్మఒడి' పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సురేష్‌ చెప్పారు. మొదటి ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఈ పథకంలో మరికొందరు అర్హులుగా చేరేలా వెసులుబాటు కల్పించామన్నారు. "అమ్మఒడి పథకం కోసం సంవత్సర ఆదాయం అర్హత తొలుత గ్రామాల్లో నెలకు రూ.5వేలు, పట్టణాల్లో రూ.6,200 ఉండగా... ప్రస్తుతం దానిని రూ.10వేలు, రూ.12వేలుగా పెంచాం. తొలి ఏడాది 42,33,095 మంది, తర్వాత 44,48,865 మంది లబ్ధి పొందారు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో 2,15,767 మంది విద్యార్థులు పెరిగారు. విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి వెళ్లాలని 75 శాతం హాజరు నిబంధన విధించాం. ఆ తర్వాత కొవిడ్‌ కారణంగా మినహాయింపు ఇచ్చాం. పారిశుద్ధ్య కార్మికుల పిల్లలను అర్హులుగా చేర్చాం. రాబోయే రోజుల్లో అవసరమైతే ల్యాప్‌టాప్‌లు సమకూర్చే ఆలోచన ఉంది. ఈ పథకం కింద తల్లి ఖాతాలో రూ.15 వేలు వేసేందుకు ఆధార్‌, రేషన్‌ కార్డు అనుసంధానం చేయాలని సూచించాం..." అని ఆయన వివరించారు. అర్హతలు తప్ప ఎలాంటి ఆంక్షలు లేవని మంత్రి సురేష్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:విద్యా సంవత్సరాన్నే మార్చేశారు?

ABOUT THE AUTHOR

...view details