ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రైతు భరోసా జాబితాలో అందుకే నా పేరుంది' - adimulapu suresh

రైతు భరోసా పథకం అర్హుల జాబితాలో... తన పేరు రావడంపై మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ ఇచ్చారు. జాబితా రూపొందించే సమయంలో సరిచూసుకోకపోవటం కారణంగా పొరపాటు జరిగిందని చెప్పారు.

మంత్రి సురేష్

By

Published : Oct 11, 2019, 7:53 PM IST

మంత్రి సురేష్

రైతు భరోసా పథకం అర్హుల జాబితాలో... తన పేరు రావడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. అధికారులు జాబితా రూపొందించే సమయంలో సరిచూసుకోకపోవటం కారణంగానే పొరపాటు జరిగిందని మంత్రి సురేష్ వివరించారు. సాగుభూమి ఉండటం వల్ల వెబ్ ల్యాండ్​లో తన పేరుందని చెప్పారు. ఆ వివరాలే రైతు భరోసాకు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు. తన పేరును రైతు భరోసా లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని అధికారులను కోరినట్లు మంత్రి స్పష్టం చేశారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని పకడ్బందీగా అమలయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ విషయం..

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరంలో... 1881 ఖాతాలో సర్వే నంబర్ 187/1లో 0.94 ఎకరా భూమి ఉంది. ఈ భూమి యజమాని మంత్రి ఆదిమూలపు సురేష్ తండ్రి శామ్యూల్ జార్జి. ఈ కారణంగా రైతు భరోసా పథకం జాబితాలో మంత్రి పేరు ఉంది. మంత్రి పేరు జాబితాలో ఉన్న విషయం గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వ్యవసాయ శాఖ ఉపసంచాలకుడు సుదర్శనరాజు తెలిపారు.

ఇదీ చదవండి

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా...?

ABOUT THE AUTHOR

...view details