దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ లోని అపోలో అసుపత్రికి తరలించారు.
మంత్రి ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్నారు. జగనన్న విద్యాకానుక ప్రారంభోత్సవంలో సైతం పాల్గొన్నారు. తర్వాత ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం ఒక్కసారిగా ఆయన అనారోగ్యం పాలవడంపై.. అధికారులు సీఎంఓకు సమాచారం ఇచ్చారు. సీఎం చొరవతో.. మంత్రిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు.