ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన మినీపురపోరు - mini municipal elections completed in state peaceful

మినీపురపోరులో భాగంగా... మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు, నల్గొండ జిల్లా నకిరేకల్‌, సిద్దిపేట మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభం కాగా మొదట్లో మందకొడిగానే కొనసాగింది. 8 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.

ts elections
ts elections

By

Published : Apr 30, 2021, 5:39 PM IST

తెలంగాణలో మినీ పురపోరు ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. క్యూలైన్​లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. 2 కార్పొరేషన్లు, 5 పురపాలికలకు ఎలక్షన్ జరిగింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లలతోపాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు పురపాలికలకు ఎన్నికలు నిర్వహించారు. అక్కడక్కడ చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగింది. బ్యాలెట్ విధానంలో ఎన్నికల జరగ్గా.. మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మధ్యాహ్నం మూడు గంటలవరకు నమోదైన పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి.

  • వరంగల్‌లో -44.15 శాతం
  • ఖమ్మంలో -51.36 శాతం
  • కొత్తూరులో 76.79 శాతం
  • లింగోజిగూడలో 22.37 శాతం
  • సిద్దిపేటలో 58.25 శాతం
  • జడ్చర్లలో 54.21 శాతం
  • అచ్చంపేటలో 60.50 శాతం
  • నకిరేకల్‌లో 76.61 శాతం

స్పల్ప ఉద్రిక్తత..

నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఉప ఎన్నికలో తెరాస, ఎంఐఎం కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పీఎస్ 18/47 పోలింగ్ బూత్​లో దొంగ ఓట్లు వేస్తున్నారని ఇరు పార్టీల నేతలు ఆరోపించుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఇరువర్గాలను చెదరగొట్టారు. ఏసీపీ రామారావు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

బాహాబాహీ..

ఖమ్మం ప్రభుత్వ పీజీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తెరాస, కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నాయి. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

ఇదీ చదవండి: ఎలక్షన్‌ కమిషన్‌లో పిటిషన్‌ వేసుకోండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details