ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇసుక మైనింగ్‌లో తెదేపా నేతల ఆరోపణలు అవాస్తవం: గనుల శాఖ

gopal krishna dwivedi
gopal krishna dwivedi

By

Published : Aug 30, 2021, 7:19 PM IST

Updated : Aug 30, 2021, 7:43 PM IST

19:08 August 30

gopal krishna dwivedi react on tdp leader pattabhi allegations

ఇసుక మైనింగ్‌లో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ చేసిన ఆరోపణలపై గనులశాఖ స్పందించింది. తెదేపా నేతల ఆరోపణలు అవాస్తవమని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది సష్టం చేశారు. ఇసుక మైనింగ్ కాంట్రాక్టును నిబంధనల ప్రకారమే ఇచ్చామని వెల్లడించారు. ఓపెన్ ఇసుక రీచ్‌ల్లో జేపీ పవర్ వెంచర్స్‌కే మైనింగ్‌కు అనుమతి ఉందన్నారు. సుధాకర్ ఇన్‌ఫ్రా సంస్థకు అనుమతి ఇచ్చామన్నది పూర్తిగా అవాస్తవమని వివరించారు. సబ్‌ కాంట్రాక్ట్ అని మోసం చేస్తున్న సుధాకర్ ఇన్‌ఫ్రాపై జూన్‌లో కేసు నమోదైందని తెలిపారు. ఇదే విషయమై ప్రభుత్వం నుంచి పోలీసు శాఖకు సమాచారం పంపించామన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని ద్వివేది వ్యాఖ్యానించారు. నిరాధార ఆరోపణలపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

'ఓపెన్ ఇసుక రీచ్‌ల్లో జేపీ పవర్ వెంచర్స్‌కే మైనింగ్‌కు అనుమతి ఉంది. సుధాకర్ ఇన్‌ఫ్రా సంస్థకు అనుమతి ఇచ్చామన్నది అవాస్తవం. సబ్‌ కాంట్రాక్ట్ అని మోసం చేస్తున్న సుధాకర్ ఇన్‌ఫ్రాపై జూన్‌లో కేసు నమోదైంది. ఇదే విషయంపై ప్రభుత్వం నుంచి పోలీసు శాఖకు సమాచారం పంపించాం. నిరాధార ఆరోపణలపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి' - ద్వివేది,  గనులశాఖ ముఖ్య కార్యదర్శి 

సీబీఐ విచారణకు తెదేపా డిమాండ్.. 

రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్‌ చేశారు. అప్పుడే ఎవరి ప్రమేయముందో విచారణలో తెలుస్తుందన్నారు. గత జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా ఇసుక లీజులు పొందిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు సుధాకర్​ ఇన్​ఫ్రాటెక్ కంపెనీపై భవానీపురం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేస్తే... ముఖ్యమంత్రి మాత్రం అదే కంపెనీకి గోదావరిలో ఇసుక తవ్వకాలకు అనుమతిలిచ్చారన్నారు. సీఎం కనుసన్నల్లోనే రాష్ట్రంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందనడానికి ఇంతకంటే రుజువేం కావాలన్నారు.

సుధాకర్​ ఇన్ ఫ్రాటెక్ నేరుగా, తమకు పలానా ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అనుమతి కావాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయాలనికి రాసిన లేఖ సహా, ఇతర ఆధారాలను పట్టాభి... మీడియా సమావేశంలో బయటపెట్టారు. సుధాకర్‌ ఇన్​ఫ్రాటెక్ కంపెనీతో సంబంధమున్న మంత్రి వెల్లంపల్లి సోదరుడు రఘునరసింహారావు పేరుని జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు స్పష్టంగా తమ ఫిర్యాదులో పేర్కొన్నా.. ప్రభుత్వం మంత్రి సోదరుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఇసుక దోపిడీలో మంత్రి సోదరుడి హస్తమున్నట్లు స్పష్టంగా తేలినా కూడా మంత్రి వెల్లంపల్లిని ఎందుకు కేబినెట్ నుంచి తొలగించలేదని దుయ్యబట్టారు. ఒక ప్రైవేట్ కంపెనీ తమకు పలానా ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అనుమతివ్వాలని నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి

క్లైమాక్స్​కు అమెరికా-అఫ్గాన్ కథ.. డెడ్​లైన్​కు 24 గంటలే!

Last Updated : Aug 30, 2021, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details