ఎన్నిక ఏదైనా, పార్టీ ఏదైనా ప్రజల తీర్పు గౌరవించాల్సిందేనని ఎంఐఎం జాతీయాధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. మేయర్ ఎన్నికపై తమనెవరూ సంప్రదించలేదని, ఒకవేళ ఎవరైనా వస్తే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తాత్కాలికమే..
గ్రేటర్ ఎన్నికల్లో భాజపా విజయం తాత్కాలికమేనన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేసిన వార్డులో కూడా భాజపా గెలవలేదని గుర్తు చేశారు. సర్జికల్ స్ట్రైక్ అని, రోహింగ్యాలు అని.. తప్పుడు ప్రచారాలు చేసి భాజపా లబ్ధి పొందిందని ఆరోపించారు.