భారత్ భూబాగాన్ని చైనా ఆక్రమించిన దానికంటే ఉక్రెయిన్ గురించి ప్రధాని బాధపడటం హాస్యాస్పదంగా ఉందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గల్వాన్ ఘటన అనంతరం లద్దాఖ్ వద్ద 2020నుంచి మన భూభాగంలో ఉన్న చైనా బలగాలను వెనక్కి పంపడానికి భారత్ వ్యూహం ఏంటో అర్దం కావడంలేదని వ్యాఖ్యానించారు. చైనీయులను వెళ్ళగొట్టేందుకు ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా...లేక వాళ్లే దయతో భారత్ భూభాగంలోనుంచి వెళ్లిపోవాలని ఆశిస్తున్నామా అని ట్విట్టర్ వేదికగా ప్రధాన మోదీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
asaduddin: "చైనా బలగాలను వెనక్కి పంపడానికి...భారత్ వ్యూహమేంటో..?" - ts news
గల్వాన్ ఘటన అనంతరం లద్దాఖ్ వద్ద 2020నుంచి మన భూభాగంలో ఉన్న చైనా బలగాలను వెనక్కి పంపడానికి భారత్ వ్యూహం ఏంటో అర్దం కావడంలేదని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. భారత్ భూబాగాన్ని చైనా ఆక్రమించిన దానికంటే ఉక్రెయిన్ గురించి ప్రధాని బాధపడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఇప్పటి వరకూ 15 సార్లు ఆర్మీ అధికారులు జరిపిన చర్యలు విఫలమయ్యాయని మరో సారి సమావేశాలు అయిపోయాయని.. అయినా పార్లమెంటుకు అసలు ఈ విషయమే చెప్పకుండా దేశాన్ని అంధకారంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. దేశ సమగ్రతను కాపాడటం కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమన్న ఆయన... అలా చేయడంలో విఫలమైతే పార్లమెంటు సాక్షిగా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అలా చేయనందుకు ప్రధాని తన నేరాన్ని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా లద్దాఖ్ సరిహద్దు వద్ద పరిస్థితిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలకు పరిస్థితిని వివరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లు సభ్యులు, జర్నలిస్టు ప్రత్యేక బృందాన్ని లద్దాఖ్ పరిస్థిని తెలుసుకునేందుకు అనుమతించాలని.. కనీసం అప్పుడైన ప్రజలకు వాస్తవాలు తెలస్తాయని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: "ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం...మళ్లీ విద్యుత్ కోతలా...మా వల్ల కాదు"