ఎంఐఎం తలుచుకుంటే తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టడం పెద్దపని కాదని.. రెండునెలల సమయం సరిపోతుందని ఛార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ రాజకీయాల్లో ఇప్పుడు ఓనమాలు నేర్చుకుంటున్నారని విమర్శించారు.
రెండునెలల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టగలం: ఎంఐఎం ఎమ్మెల్యే - కేటీఆర్‌పై చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఫైర్
ఎంఐఎం తలుచుకుంటే తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టడం పెద్దపని కాదని, రెండునెలల సమయం సరిపోతుందని... ఛార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ చెప్పిన మాటలు గుర్తు చేసిన ముంతాజ్... రాజకీయం ఎంఐఎంకు కొత్తకాదని ఇలాంటి ప్రభుత్వాలను ఎన్నో చూసిందని పేర్కొన్నారు. ఎంఐఎం తల్చుకుంటే గ్రేటర్ ఎన్నికల్లోనే కాదు తెరాస పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఎంఐఎంను పార్టీలు విమర్శించడం కొత్తేమీ కాదు.. అలాచేసి ఎన్నో పార్టీలు నామరూపాల్లేకుండా పోయాయన్నారు. ఎవరెన్ని శాపనార్థాలు పెట్టినా ఎంఐఎం మాత్రం దినదినాభివృద్ధి చెందుతోందని ముంతాజ్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :