భాజపా నాయకులకు అభివృద్ధి గురించి చెప్పుకొనే ధైర్యం లేక రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. హైదరాబాద్ భోలక్‌పూర్‌లో ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. సర్జికల్ దాడుల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ దాడులు చేసి పాకిస్తానీయులను వెలికితీస్తామనటాన్ని తీవ్రంగా ఖండించారు.
'పాకిస్థానీయులు ఎంత మంది ఉన్నారో 24 గంటల్లో తేల్చండి' - ghmc elections 2020
హైదరాబాద్ భోలక్‌పూర్‌లో ఎంఐఎం బహిరంగసభ నిర్వహించింది. సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. భాజపా నేతలకు సవాల్ విసిరారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ దాడులు చేసి పాకిస్తానీయులను వెలికితీస్తామనటాన్ని తీవ్రంగా ఖండించారు.
భారత భూభాగంలో 970 చదరపు కిలోమీటర్లలో కబ్జా చేసిన చైనా పేరు పలికే ధైర్యం లేదు కానీ... స్వదేశంలో సర్జికల్ దాడులు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భారత భూభాగంపై పాకిస్తానీయులు ఉండేందుకు ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోమని ఓవైసీ తేల్చి చెప్పారు. పాతబస్తీలో ఎంత మంది పాకిస్తానీయులు ఉన్నారో 24గంటల్లో లెక్కలు తేల్చాని కేంద్రహోం శాఖను ఓవైసీ డిమాండ్ చేశారు. పాకిస్తాన్, టెర్రరిజం, రోహింగ్యా లాంటి పదాలు వాడకుండా ప్రచారం నిర్వహించగలరా అని భాజపా నేతలకు అసదుద్దీన్ సవాల్ విసిరారు.
ఇదీ చూడండి: రేపు జగనన్న తోడు ప్రారంభం .. కొండపల్లి బొమ్మలతో ఆహ్వాన పత్రాలు
TAGGED:
surgical strikes issue news