ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Milk shortage: శీతాకాలంలోనూ పెరగని పాల ఉత్పత్తి.. కారణమేంటి? - Vijaya dairy

తెలంగాణలో పాల కొరత తీవ్రంగా ఉంది (milk shortage). చలికాలం వచ్చినా.. పాల ఉత్పత్తి పెరగలేదు. రైతుల నుంచి ఆశించినంత పాల సేకరణ లేకపోవడంతో విజయ డెయిరీ (Vijaya dairy) సైతం... కర్ణాటక (Karnataka)నుంచే లక్ష లీటర్లు పాలను నిత్యం కొంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి రోజుకు 20 లక్షల లీటర్ల కొనుగోలు చేస్తోంది.

Milk shortage
Milk shortage

By

Published : Nov 18, 2021, 1:58 PM IST

పాల ఉత్పత్తి అధికంగా ఉండాల్సిన శీతాకాలంలోనూ తెలంగాణ ఇతర రాష్ట్రాలపై (milk shortage) ఆధారపడుతోంది. రోజూ బయట నుంచి 20 లక్షల లీటర్లు కొంటే తప్ప చాయ్‌ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. పలు ప్రైవేటు డెయిరీలతో పాటు, ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీ (Vijaya dairy) సైతం నిత్యం లక్ష లీటర్ల వరకూ కర్ణాటక సహకార డెయిరీల సమాఖ్య నుంచి కొంటోంది. రాష్ట్రంలో నిత్యం 1.40 కోట్ల లీటర్ల పాలు అవసరమని పశుసంవర్ధక శాఖ అంచనా. కానీ మొత్తం ఉత్పత్తి (milk shortage) 1.20 కోట్ల లీటర్లలోపే ఉంది. విజయ డెయిరీ (Vijaya dairy) నిత్యం గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు 3.50 లక్షల లీటర్లను విక్రయిస్తోంది. రాష్ట్రంలో రైతుల నుంచి 2.50 లక్షల లీటర్లే డెయిరీకి వస్తున్నాయి. మిగతా లక్ష లీటర్లను బయట కొని (milk shortage) ప్రజలకు విక్రయిస్తోంది.

ఎందుకింత కొరత...?

  • పాడి పశువుల పెంపకం ఖరీదైన వృత్తిగా మారుతోంది. కూలీలు దొరకడం లేదు. చిన్న డెయిరీల్లో పశువుల దగ్గర పనిచేయడానికి బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కూలీలను పిలిపించి నియమించినట్లు రాష్ట్ర పాడి రైతుల సంఘం నేత బాల్‌రెడ్డి చెప్పారు.
  • సాగునీటి లభ్యతతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో పశువులను మేపడానికి ఖాళీ భూములు తగ్గిపోయాయి.
  • రోజూ కూలికి వెళితే రూ.300 నుంచి 500 దాకా ఇస్తున్నారు. పాడి వల్ల అంత ఆదాయం రావడం లేదని ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు.
  • దాణాలో కలిపే సోయా, మొక్కజొన్న చెక్క ధరలు ఇటీవల ఏకంగా 20 శాతం పెరిగాయి. 25 కిలోల నాణ్యమైన దాణా చెక్క కావాలంటే రూ.వెయ్యి ఖర్చవుతోంది. దీంతో చాలామంది పాడిపై దృష్టి పెట్టడం లేదు.
  • పశుగ్రాసం పెంపకం పెద్దగా లేదు. రైతులు పంటల సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు.

ఏటా అక్టోబరు నుంచి మార్చి వరకూ పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. కానీ రాష్ట్రంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పాడి పశువుల సంఖ్య తగ్గడం, వాతావరణ మార్పుల వల్ల అవి ఈనడం ఆలస్యం కావడంతో క్షీర ఉత్పత్తి (milk shortage) ఈ సీజన్‌లో పెద్దగా పెరగలేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వర్గాలు చెప్పాయి. ‘రాష్ట్ర అవసరాలతో పోలిస్తే రోజుకు 20 లక్షల లీటర్ల వరకూ కొరత ఉన్నమాట వాస్తవమే’నని సీనియర్‌ పశువైద్యుడు ఒకరు వివరించారు. విజయ డెయిరీ (Vijaya dairy)తో పాటు కరీంనగర్‌, రంగారెడ్డి-నల్గొండ (నార్ముల్‌), ముల్కనూరు సహకార డెయిరీలకు నిత్యం పాలుపోసే పాడి రైతులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాన్నివ్వాలి. గత మే నుంచి ఇప్పటివరకూ సొమ్మును ఇవ్వకపోవడంతో బకాయిలు రూ.50 కోట్లకు పైగా పేరుకుపోయాయి. 25 కిలోల దాణా బస్తా ధర గత రెండేళ్లలో రూ.600 నుంచి రూ.వెయ్యికి చేరింది. ఇక పశువుల దగ్గర పనిచేయాలంటే రోజుకు రూ.500 చొప్పున కూలి అడుగుతున్నారని, అంత ఇచ్చినా కూలీలు దొరకడం లేదని రాష్ట్ర పాడి రైతుల సంఘం నేల బాల్‌రెడ్డి తెలిపారు. దాణా రేట్లు, నిర్వహణ భారంగా మారడంతో రైతులు పాలివ్వని పశువులను అమ్మేస్తున్నారని, కొత్తవి కొనడంలేదని పశుసంవర్ధక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.


ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details