రేపటి నుంచి వితంతు, వృద్ధాప్య పింఛన్తో పాటు సైనిక సంక్షేమ పింఛన్లు నేరుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 61.65 లక్షల మంది లబ్ధిదారులకు 1497.88 కోట్లు విడుదల చేశారు. ఈనెలలో కొత్తగా 34,907 మందికి పెన్షన్ మంజూరు చేసినట్టు ప్రభుత్వం తెలియజేసింది. కొత్త పింఛన్‌దారుల కోసం 8.52 కోట్లు విడుదల చేశారు.
లబ్ధిదారులకు నేరుగా పింఛన్ అందించేందుకు 2.52 మంది వాలంటీర్లు సేవలు అందిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల నుంచి సైనిక సంక్షేమ పింఛన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది. 847 సైనిక సంక్షేమ పింఛన్ల కోసం.42.35 లక్షలను విడుదల చేశారు. పింఛన్ పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌బీఐఎస్ సాంకేతికత అమలు చేయాలని నిర్ణయించారు.