మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజైన మిలాద్ ఉన్ నబీని భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఆకాంక్షించారు. దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వమానవ సమానత్వం, ఐకమత్యం వంటి ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు.
సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేసిన దివ్యచరితుడు: చంద్రబాబు
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలకు తెదెపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేసిన దివ్యచరితుడు ప్రవక్త అని చెప్పారు. శాంతియుత సహజీవనానికి, నవ నాగరికతకు అంకురార్పణ చేశారన్నారు.
మహమ్మద్ ప్రవక్త బోధనలు అమూల్యం: పవన్