తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బావిలో మరో మృతదేహం లభ్యమైంది. నిన్న గొర్రెకుంటలోని బావిలో 4 మృతదేహాలు గుర్తించగా.. వాటిలో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఉన్నారు. పోలీసులు బావిలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నీరు ఎక్కువగా ఉండటం వల్ల మృతదేహాన్ని తీయడం ఇబ్బందిగా మారింది.
తెలంగాణ: వరంగల్‌లో దొరికిన ఐదో మృతదేహం ఎవరిది? - వరంగల్‌లో వలస కూలీల మృతి వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా వలస కూలీలు మృతి చెందిన గొర్రెకుంట బావిలో మరో మృతదేహం లభ్యమైంది. మృతుల సంఖ్య ఐదుకు చేరింది. పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
migrant-worker-dead-
మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. 20 ఏళ్ల క్రితం బంగాల్ నుంచి వచ్చి వరంగల్‌లో స్థిరపడిన కుటుంబమని స్థానికులు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూలీల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.