ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాడపల్లి చెక్​పోస్ట్​ వద్ద బారులు తీరిన వలస కూలీలు - వాడపల్లి చెక్​పోస్ట్ వద్ద వలస కూలీలు

స్వస్థలాలకు వెళ్లేందుకు తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్​పోస్ట్ వద్దకు పెద్ద ఎత్తున వలస కూలీలు వస్తున్నారు. ఇక్కడ వైద్య పరీక్షలు చేసి పంపించినప్పటికీ... ఏపీ​ అధికారులు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాడపల్లి చెక్​పోస్ట్​ వద్ద బారులు తీరిన వలస కూలీలు
వాడపల్లి చెక్​పోస్ట్​ వద్ద బారులు తీరిన వలస కూలీలు

By

Published : May 4, 2020, 5:05 PM IST

తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్​పోస్ట్​ వద్ద ఏపీకి వచ్చేందుకు వలస కూలీలు బారులు తీరారు. సుమారు 600 మంది చెక్​పోస్ట్​ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ పోలీసులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనుమతి పత్రాలు ఇచ్చి పంపుతున్నారు. కానీ వారిని రాష్ట్రంలోకి ఎటువంటి ఆదేశాలు లేవని ఆంధ్రప్రదేశ్​లోని పొందుగుల వద్ద అధికారులు తిప్పి పంపిస్తున్నారు.

ద్విచక్ర వాహనాల మీద కొంతమంది, నడుచుకుంటూ హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మరికొందరు.. ఇక్కడికి చేరుకున్న వారిలో ఉన్నారు. వారిని రాష్ట్రంలోకి ప్రవేశింపజేసే విషయమై... ప్రభుత్వం నిరాకరించడం వల్ల లబోదిబోమంటున్నారు. చిన్న పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆహారం, తాగునీరు అందుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details