ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వలస జీవుల వ్యథలు వర్ణనాతీతం - migrant labor problems in bhadradri

బతుకంతా కష్టాలే అన్నట్టుంది వలస జీవుల పరిస్థితి.. కేంద్రం స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతిచ్చినా ప్రభుత్వాలు రవాణా సదుపాయం సమకూర్చేదాకా నిలువలేక, నిరీక్షించలేక చాలామంది ఇంటిబాట పట్టారు. ఈ ప్రయత్నంలో ఉన్న నాలుగు రూపాయలూ సమర్పించుకుంటున్నారు. ఇంకొందరు ఆపసోపాలు పడి సరిహద్దుదాకా వచ్చినా అనుమతుల పేరిట రానీయకపోవటంతో ఉసూరుమంటున్నారు. గంటల తరబడి వేచిఉండి, కడుపు మండి రోడ్కెక్కారు. ఇంకోచోట ప్రభుత్వమే తమను పంపాలని గ్రానైట్‌ కార్మికులు ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వలస జీవనావస్థలపై ఈటీవీ భారత్ కథనమిది..

వలస జీవుల వ్యథలు వర్ణనాతీతం
వలస జీవుల వ్యథలు వర్ణనాతీతం

By

Published : May 4, 2020, 10:51 AM IST

సర్దు‘బాట’..

పనుల కోసం వచ్చి కరోనా కారణంగా ఆ పనుల్లేక, ఇక్కడ ఉండలేక.. ఇబ్బందిపడుతున్న వలస కూలీలకు ఎట్టకేలకు ఎగిరేందుకు రెక్కలు వచ్చాయి. రోజులుగా ఖాళీగా ఉంటున్న వారికి ప్రతి పైసా ఎంతో విలువైందే. అయినా.. తమకు కష్టమైనా.. ప్రైవేటు వాహనాలను సమకూర్చుకుని స్వస్థలాలకు వెళ్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నుంచి ఓ కూలీ ఆదివారం ఇలా గుడారం సర్దుకుని స్వస్థలం వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.

సరిహద్దున సహనానికి పరీక్ష

సంతోషంగా పయనమైనా సరిహద్దుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. భద్రాద్రి అదనపు కలెక్టర్, ఏపీ అధికారులు, మంత్రి అవంతి శ్రీనివాస్‌తో మాట్లాడినా ఫలితం లేదు. ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం వెళ్లేందుకు వలస కూలీలు ఆదివారం తెల్లవారుజామున అశ్వారావుపేటలో సరిహద్దుకు చేరారు. ఏపీ అధికారులు నిరాకరించటంతో రాత్రి 10 గంటలు దాటినా అక్కడే పడిగాపులు కాశారు. ఎస్‌ఐ మధు ప్రసాదు దగ్గరుండి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు.

ఇదీ చదవండి :కుప్పంలో మనిషి అవశేషాలు కలకలం

ABOUT THE AUTHOR

...view details