హైదరాబాద్‌ను ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అక్కడి మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్ సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈనాడు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు.
హైదరాబాద్‌లో ఈనాడు ప్రాపర్టీ షో.. ప్రారంభించిన మెట్రో ఎండీ - metro md nvs reddy
రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ప్రారంభించారు.
metro-md-nvs-reddy-starts-eenadu-property-show
స్థిరాస్తి వ్యాపారం దేశమంతటా తిరోగమనంలో ఉన్నా... హైదరాబాద్‌లో మాత్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోందని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా హైదరాబాద్ అభివృద్ధి కేంద్రంగా మారే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనాడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30వ ప్రాపర్టీ షోను అందరూ వినియోగించుకోవాలని కోరారు.