weather update in ap: అండమాన్ ఆ పరిసర ప్రాంతాల్లో సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండం మారే అవకాశం ఉందని తెలియచేసింది. తదుపరి 24 గంటల్లో వాయుగుండం తుపానుగా బలపడుతుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ డిసెంబరు 4 తేదీ నాటికి ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశాల మధ్య తీరాన్ని దాటే అవకాశమున్నట్టు తెలియచేసింది.
weather update: స్థిరంగా అల్పపీడనం...24 గంటల్లో వాయు గుండంగా మారే అవకాశం! - ap rains
weather update in ap: అండమాన్ ఆ పరిసర ప్రాంతాల్లో సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
దీని ప్రభావంతో ఈ నెల 3 తేదీ నుంచి ఉత్తర కోస్తాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. కోస్తాంధ్ర తీరప్రాంతంలోని మత్స్యకారులు రాగల రెండు రోజుల్లో చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేసింది. పోర్టులకు కూడా అప్రమత్తత హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉభయగోదావరి, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన రైతులు పంటలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.
ఇదీ చదవండి:HC SUO MOTO: ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై హైకోర్టులో విచారణ