దసరా సెలవుల తర్వాత ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపనున్నారు. అయితే 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. విద్యా సంవత్సరం పునఃప్రారంభంలో దీన్ని అమలు చేయాలని అధికారులు భావించారు. ఉన్నత పాఠశాలతో, ప్రాథమిక బడులను అనుసంధానం చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను ఇప్పటి వరకు అధికారులు పరిశీలించారు. దసరా పండుగ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3,627 ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతుల్ని 3,178 ఉన్నత పాఠశాలల్లో కలపనున్నారు. ఉన్నత పాఠశాలల్లో భవనాల కొరత ఉన్నచోట ప్రాథమిక బడుల్లోని విద్యార్థులను అక్కడే ఉంచి, సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధించనున్నారు.
Primary Schools : దసరా సెలవుల తర్వాత 3,4,5 తరగతుల విలీనం - ఏపీలో ఉన్నత పాఠశాలల విద్యార్థుల సంఖ్య
దసరా సెలవుల తర్వాత ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపనున్నారు. అయితే 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు.
దసరా సెలవుల తర్వాత 3,4,5 తరగతుల విలీనం