సెలక్ట్ కమిటీకి పార్టీల నుంచి సభ్యుల పేర్లు ఖరారు! - bjp
3 రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లిన నేపథ్యంలో.. కమిటీలో తమ సభ్యులను తెదేపా, భాజపా, పీడీఎఫ్ ఖరారు చేశాయి.
మండలి సెలక్ట్ కమిటీలో సభ్యులుగా.. తెదేపా, భాజపా, పీడీఎఫ్‌లు తమ నేతల పేర్లను పంపించాయి. తెదేపా నుంచి 3 రాజధానుల బిల్లుకు లోకేశ్, అశోక్‌బాబు, తిప్పేస్వామి, బి.టి.నాయుడు, సంధ్యారాణి... సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు దీపక్‌రెడ్డి, బి.అర్జునుడు, బీదా రవిచంద్ర, గౌనువారి శ్రీనివాసులు, బుద్ధా వెంకన్న పేర్లు ఖరారయ్యాయి. భాజపా నుంచి 3 రాజధానుల బిల్లుకు మాధవ్.. సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు సోము వీర్రాజు ఎంపికయ్యారు. పీడీఎఫ్ నుంచి 3 రాజధానుల బిల్లుకు కె.ఎస్.లక్ష్మణరావు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు ఇళ్ల వెంకటేశ్వరరావు పేర్లు ఖరారయ్యాయి.