పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎల్ 1 గా నిలిచింది. హెడ్ వర్క్స్ , ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ , జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన పనుల టెండర్ ను దక్కించుకుంది. రూ.4,987.55 కోట్ల ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువకు రూ.4,359.11 కోట్లను కోట్ చేసింది. అంచనా విలువ కంటే 12.6 శాతం తక్కువ కోట్ చేసి పనులను సొంతం చేసుకుంది. టెండర్లకు సంబంధించి ఈ నెల 21 తేదీ వరకు బిడ్లను స్వీకరించామని... అయితే మేఘా ఇంజినీరింగ్ సంస్థ మాత్రమే బిడ్ దాఖలు చేసిందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
'మేఘా'కే.. పోలవరం జలాశయ కీలక నిర్మాణ పనులు - మేఘా ఇంజినీరింగ్ వర్క్స్
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్లో పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. రూ.4,358 కోట్లకు టెండర్ కోట్ చేసి ఎల్-1 గా నిలిచింది.
పోలవరం ప్రాజెక్టు