హైదరాబాద్ జలసౌధ వేదికగా గోదావరి-కావేరి అనుసంధానం(Godavari-Kaveri Rivers Connection)పై సమావేశం ప్రారంభమైంది. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2వ సంప్రదింపుల భేటీ జరుగుతోంది. సమావేశంలో తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఇంజినీర్లు పాల్గొన్నారు. దృశ్యమాధ్యమం ద్వారా 8 రాష్ట్రాల అధికారులు భేటీలో పాల్గొన్నారు.
గోదావరి (ఇచ్చంపల్లి), కావేరి (గ్రాండ్ ఆనికట్) నదుల అనుసంధానంపై చర్చించేందుకు జాతీయ జలాభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) శుక్రవారం ఎనిమిది సభ్య రాష్ట్రాలతో ఈ సమావేశం నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి సంస్థ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. దిల్లీ నుంచి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, తెలంగాణ, ఏపీతోపాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.