ప్రస్తుతం చక్కెర కర్మాగారాల వద్ద ఉండిపోయిన నిల్వలను విక్రయించుకునేందుకు ఉన్న అవకాశాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. మూతపడిన సహకార కర్మాగారాల్లో సిబ్బంది జీతభత్యాల చెల్లింపులు, వీఆర్ఎస్ లాంటి అంశాలు సహా ఫ్యాక్టరీల పునరుద్ధరణపై మంత్రుల కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. చక్కెర కర్మాగారాలకు బకాయిలు చెల్లింపులపై చర్చించారు. పరిశీలన నివేదికను ముఖ్యమంత్రి దష్టికి తీసుకువెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. చెరకు రైతులకు ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.
మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. కీలక అంశాలపై చర్చ - AP Latest News
రాష్ట్రంలో చెరకు ఉత్పత్తి, విక్రయాలు, చక్కెర కర్మాగారాల పరిస్థితిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహా మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మంత్రివర్గ ఉపసంఘం భేటీ