ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ - తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. హైదరాబాద్​లో ఈ సమావేశం జరుగుతోంది. అధికారుల సమావేశం కొలిక్కివస్తే... ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల మధ్య సమావేశం జరిగే అవకాశం ఉంది.

rtc meet
rtc meet

By

Published : Sep 15, 2020, 10:00 AM IST

Updated : Sep 15, 2020, 5:07 PM IST

రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం హైదరాబాద్​లో జరుగుతోంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఆర్టీసీ ఎండీలు, ఈడీలు హాజరయ్యారు. అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ, కిలోమీటర్లపై చర్చ జరుగుతోంది. ఏ రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే అంశంపై ఆర్టీసీ ఎండీలు చర్చిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో... ఏపీ 2.64 లక్షల కి.మీలు మేర బస్సులను తిప్పుతోంది. ఏపీలో... తెలంగాణ 1.52 లక్షల కి.మీ.లు తిప్పుతోంది. తెలంగాణ కంటే ఏపీ అదనంగా 1.12 లక్షల కి.మీలు బస్సులను తిప్పుతోంది.

ఏపీ ఎన్ని కిలోమీటర్లు తెలంగాణ భూభాగంలో తిప్పితే... అన్ని కిలోమీటర్లు తెలంగాణ బస్సులు ఏపీ భూభాగంలో తిప్పాలి. కానీ... ఇంతకు ముందు రెండుసార్లు జరిగిన ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశంలో ఈ అంశం కొలిక్కి రాలేదు.

గత సమావేశంలో ఏపీని లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరారు. 55 వేల కి.మీ.లకు మించి తగ్గించుకోమని ఏపీ అధికారులు చెప్పారు. అధికారుల సమావేశం కొలిక్కివస్తేనే... ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల మధ్య సమావేశం జరుగనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:

సీఆర్‌డీఏపై సీబీఐ విచారణ కోరాలి: సీఎం జగన్

Last Updated : Sep 15, 2020, 5:07 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details