రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖలో భేటీ ముగిసింది. ఐదుగురు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ఏపీ బృందం భేటీ అయ్యి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించింది. భేటీలో.. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి సహా 20 మంది ఉన్నతాధికారులు, పీఎంవో అధికారులు పాల్గొన్నారు.
FINANCE : ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖలో ముగిసిన భేటీ.. త్వరలోనే శుభవార్త వస్తుందన్న ఎంపీ..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ వద్ద భేటీ ముగిసింది. కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం నార్త్ బ్లాక్‌లో ఆ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్ర రెవెన్యూ లోటుపైనా చర్చించామని.. పరిష్కార మార్గాలు అన్వేషించామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి త్వరలోనే శుభవార్త వస్తుందన్నారు.
సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో.. పోలవరం నిధులు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, రెవెన్యూ లోటు, తదితర అంశాలపై చర్చలు జరిపామని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. పోలవరంలో మారిన వ్యయ అంచనా ఆమోదానికి కేంద్రం సుముఖత చూపిందని తెలిపారు. ప్రధానికి సీఎం ఇచ్చిన వినతిపత్రంలోని అంశాలన్నీ చర్చించి.. పరిష్కార మార్గాలు అన్వేషించామని అన్నారు. పునరావాసం, మిగతా అంశాలపై రాష్ట్రానికి లబ్ధి జరిగేలా చర్చలు జరిపామన్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటుపైనా చర్చించామని..పరిష్కార మార్గాలు అన్వేషించామన్నారు. కేంద్రం నుంచి త్వరలోనే శుభవార్త వస్తుందన్నారు.
ఇదీ చదవండి: పీఆర్సీపై వైకాపావి అసత్య ప్రచారాలు.. ఇవిగో వాస్తవాలు:ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య