ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: ఆస్పత్రికి ముఖ్యమంత్రి జగన్‌... అపాయింట్‌మెంట్లన్నీ రద్దు - ap cm jagan latest news

కొన్ని రోజుల క్రితం వ్యాయామం చేస్తూ గాయపడ్డ ముఖ్యమంత్రి జగన్​.. ఈరోజు మరోసారి కాలు నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యులు జగన్​కు.. కొన్ని పరీక్షలు నిర్వహించారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడం వల్ల ముఖ్యమంత్రి అపాయింట్​మెంట్లను అధికారులు రద్దు చేశారు.

CM jagan
CM jagan

By

Published : Nov 12, 2021, 12:13 PM IST

Updated : Nov 13, 2021, 5:07 AM IST

సీఎం జగన్‌కు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుపత్రిలో శుక్రవారం వైద్యులు ఎంఆర్‌ఐ పరీక్షలు చేశారు. సుమారు రెండు నెలల క్రితం జిమ్‌ చేస్తుండగా ఆయన ఎడమ కాలుకు స్వల్ప గాయమైంది. వ్యాయామాలు చేసేటప్పుడు అది నొప్పి పెడుతుండటంతో వ్యక్తగత వైద్యుడి సలహా మేరకు ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించుకోవడానికి వచ్చారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాలు మడమ భాగంతో పాటు కీళ్ల వద్ద పరీక్షలు చేశారు. వాటి నివేదికలు వచ్చేవరకు ముఖ్యమంత్రి జగన్‌ ఆసుపత్రిలోనే ఉన్నారు. కాలికి ఏమీ కాలేదని, బాగానే ఉందని... ఎలాంటి విశ్రాంతి అవసరం లేదన్నారు. కొన్ని రోజులు సాధారణ వ్యాయామాలు చేసుకోవాలని వైద్యులు సలహానిచ్చారు. అవి చేసేటప్పుడు కాలికి బ్యాండేజ్‌ ధరించాలని, షూ వేసుకోవద్దని సూచించారు. ఆసుపత్రి ఫిజియోథెరపిస్టు సమక్షంలోనే ఒక బ్యాండేజిని కాలికి తొడిగి చూపించారు. ఎంఆర్‌ఐతో పాటు రక్త, కొలెస్టరాల్‌ స్థాయి పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం 9.45 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లిన ఆయన తిరిగి 11.50 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి స్వాగతం పలికారు. డాక్టర్‌ జీవీ రెడ్డి, రేడియాలజిస్టు డాక్టర్‌ సతీష్‌ ఎంఆర్‌ఐ పరీక్షలు చేశారు. సీఎం వెంట డాక్టర్‌ హరికృష్ణ తదితరులున్నారు.

Last Updated : Nov 13, 2021, 5:07 AM IST

ABOUT THE AUTHOR

...view details