ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ukraine Cat: 'పిల్లే కదా అని వదల్లేదు.. తనతో పాటే' - cat sanja news

Ukraine Cat: ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి వచ్చిన ఓ మెడికో విద్యార్థి తనతోపాటు పెంపుడు జంతువు పిల్లిని కూడా వెంట తెచ్చుకున్నాడు. ఆ పిల్లికి వీసా, టిక్కెట్‌ తీసుకుని విమానంలో సొంత గడ్డకు చేరుకున్నాడు. అది చూసిన కుటుంబ సభ్యులు, మిత్రులు అతడి జంతు ప్రేమను చూసి ఆశ్చర్యపోయారు.

Khammam medico student cat
'పిల్లే కదా అని వదల్లేదు.. తనతో పాటే'

By

Published : Mar 5, 2022, 9:41 AM IST

Ukraine Cat: ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి వచ్చిన ఓ మెడికో విద్యార్థి... తనతోపాటు పెంపుడు జంతువు పిల్లిని కూడా వెంట తెచ్చుకున్నాడు. ఆ పిల్లికి వీసా, టిక్కెట్‌ తీసుకుని విమానంలో సొంత గడ్డకు చేరుకున్నాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండికి చెందిన ప్రఖ్యాత్‌... ఉక్రెయిన్‌లోని ఇవాన్‌ ఫ్రాంకిస్క్‌ నగరంలో వైద్య విద్య చదువుతున్నాడు.

ప్రఖ్యాత్‌

రెండు నెలల్లో అతడి చదువు పూర్తి కావస్తుండగా యుద్ధం నేపథ్యంలో.. రొమోనియో నుంచి ప్రత్యేక విమానంలో.. హైదరాబాద్‌ చేరుకున్నాడు. 200 మంది విద్యార్థులతోపాటు పిల్లిని కూడా విమానంలో వెంట తీసుకుని వచ్చాడు. వైద్య విద్య బోధించే ఆచార్యురాలు తనకు పిల్లిని బహుమతిగా ఇచ్చారని సాంజ అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దగా పెంచుకున్న దానిని.. వదిలేయలేక తనతోపాటు తీసుకొచ్చానని ప్రఖ్యాత్‌ తెలిపాడు. జంతు ప్రేమికుడిగా తాను చాటిన ఔదార్యాన్ని.. కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details