వైద్య, దంత కోర్సుల ఆఖరు సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలను నిర్వహించేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ సన్నాహాలు చేస్తోంది. తాజాగా పరీక్షల తేదీల షెడ్యూల్ను విడుదల చేసింది. డిగ్రీ స్థాయిలో కోర్సులకు ఆగస్టు 10 నుంచి 31 లోగా పరీక్షలు నిర్వహించాలని ఆయా కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఇంటర్నల్స్తో పాటు ఎండీ ఆయుర్వేద, హోమియో, నాచురోపతి, ఎంపీటీ పరీక్షల తేదీలనూ వెల్లడించింది.
ఆగస్టులో వైద్య విద్యార్థుల వార్షిక పరీక్షలు - ntr health versity news
వైద్య విద్యార్థులకు ఆఖరి సంవత్సరం వార్షిక పరీక్షలకు సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టులో పరీక్షలు నిర్వహించాలని ఆయా కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది.
ఆగస్టులో వైద్య విద్యార్థుల వార్షిక పరీక్షలు