ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో గత రాత్రే రఘురామను.. గుంటూరు జిల్లా జైలు నుంచి ప్రత్యేకమైన భద్రత మధ్య సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక మెడికల్ బోర్డు, న్యాయాధికారి సమక్షంలో వైద్య పరీక్షలు జరగనున్నాయి. వైద్య పరీక్షల పర్యవేక్షణకు న్యాయాధికారిని నియమించాలన్న సుప్రీం ఆదేశాలతో.... హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ నాగార్జునను తెలంగాణ హైకోర్టు నియమించింది.
రఘురామకు వైద్య పరీక్షలు ప్రారంభం.. ప్రత్యేక మెడికల్ బోర్డు పర్యవేక్షణ - Medical examination for MP Raghuram
09:32 May 18
ముగ్గురు సభ్యులతో కూడిన బృందం వైద్య పరీక్షలు చేస్తోంది. ప్రక్రియను మొత్తం సుప్రీం ఆదేశాల ప్రకారం వీడియోగ్రఫీ చేయనున్నారు. ప్రత్యేక న్యాయాధికారి.. వైద్య పరీక్షల నివేదికను సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. సుప్రీం కోర్టు తదుపరి ఆదేశాల వరకు ఆర్మీ ఆస్పత్రిలోనే రఘురామ ఉండనున్నారు. ఈ చికిత్స కాలాన్ని జ్యుడీషియల్ కస్టడీగా భావించాలని అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వైద్య పరీక్షల నేపథ్యంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: