ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు - CM KCR in yashoda hospital secundrabad

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి రానున్నారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటం వల్ల వైద్యపరీక్షలు నిర్వహించుకోనున్నారు.

medical examinations for cm kcr in yashoda hospital secundrabad
యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

By

Published : Jan 7, 2021, 3:12 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు కాసేపట్లో సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకోనున్నారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటం వల్ల బుధవారం ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఎంఆర్ఐ, సీటీ స్కాన్ లాంటి పరీక్షలు కూడా అవసరమని వైద్యులు నిర్ణయించారు. ఇవాళ మధ్యాహ్నం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో సీఎం కేసీఆర్​కు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details