ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేయండి: మంత్రి ఆళ్ల నాని - ఏపీలో కరోనా తీవ్రత

రాష్ట్రంలో కరోనా తీవ్రతపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. కేసుల తీవ్రత దృష్ట్యా కొవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.

Medical and Health Minister Alla Nani conducted a review on corona severity
మంత్రి ఆళ్ల నాని

By

Published : Mar 26, 2021, 12:54 PM IST

Updated : Mar 26, 2021, 1:30 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో...జిల్లాల్లో కొవిడ్ ఆసుపత్రులు సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అధికారులను ఆదేశించారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన మంత్రి.. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దృష్ట్యా సర్వే చేయించాలని నిర్ణయించారు.

విజయవాడలోని కార్పొరేట్ కళాశాలల హాస్టళ్ల నుంచి తిరిగి వచ్చిన 70 మంది విద్యార్ధులు.., చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తికి కారణమైనట్టు ఆ జిల్లా అధికారులు చెప్పారు. చిత్తూరు, మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో 108 పడకల వార్డుల్ని ప్రత్యేకించి కరోనా రోగుల కోసం సిద్ధం చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోనూ.. కరోనా వ్యాప్తినిరోధక చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి.ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యం..మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ విచారణ

Last Updated : Mar 26, 2021, 1:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details