ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం - medchal district incharge collector shwetha mahanthi

హైదరాబాద్ మల్లాపూర్​లో అంబులెన్స్​లో గర్భిణి మరణంపై మేడ్చల్ ఇంఛార్జ్ కలెక్టర్ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు.

అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం
అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం

By

Published : May 15, 2021, 8:14 PM IST

హైదరాబాద్ మల్లాపూర్​లో అంబులెన్స్​లో గర్భిణి మరణంపై మేడ్చల్ ఇంఛార్జ్ కలెక్టర్ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్​ఓ పావని మృతురాలి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. ఆమె మృతిపై వివరాలు సేకరిస్తున్నారు. శుక్రవారం పావనికి ఆయాసం రాగా ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లారు. గర్భిణికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఆమెకు చికిత్స చేయడానికి ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. అనంతరం మరో నాలుగు ఆస్పత్రులకు వెళ్లినా ఎవరూ చేర్చుకోలేదు. చివరకు కోఠి ప్రసూతి ఆస్పత్రికి తరలిస్తుండగా పావని అంబులెన్స్​లోనే మృతి చెందింది.

సంబంధిత కథనం:

అవాంతరాల నడుమ పావని అంత్యక్రియలు పూర్తి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details