ముగిసిన మేడారం జాతర... వన ప్రవేశం చేసిన సమ్మక్క, సారలమ్మ - సమ్మక్క సారక్క జాతర
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసింది. నాలుగు రోజులుగా అత్యంత వైభవంగా పూజలు అందుకున్న అమ్మవార్లు వన ప్రవేశం చేశారు. డప్పు చప్పుళ్లు, వాయిద్యాల మద్య సమ్మక్క-సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు వనంలోకి వెళ్లారు.
ముగిసిన మేడారం జాతర... వన ప్రవేశం చేసిన సమ్మక్క, సారలమ్మ
తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించి పరవశించిపోయారు. నాలుగు రోజులుగా అత్యంత వైభవంగా పూజలు అందుకున్న గిరిజన దేవతలు వనంలోకి వెళ్లారు. గద్దెల నుంచి డప్పు చప్పుళ్లు, వాయిద్యాల మద్య సమ్మక్క-సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు వన ప్రవేశం చేశారు. ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించి జాతరకు ఏర్పాట్లు చేసింది.