తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారక్క గుద్దెలను రేపటి నుంచి 21 రోజుల పాటు మూసివేయనున్నారు. మేడారంలో ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మేడారం మిని జాతర సమయంలో ఇద్దరు ఉద్యోగులకు కొవిడ్ సోకింది. కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హనుమంతు కె.జండగె ఆదేశాల మేరకు సోమవారం నుంచి 21 రోజుల వరకు గద్దె తలుపులు మూసి వేస్తున్నట్లు అధికారికంగా దేవాదాయ శాఖ అధికారి రాజేశ్వరరావు, పూజారి పెద్ద సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. ఈ నెల 24న ప్రారంభమైన చిన జాతర 27న ముగిసింది.
తెలంగాణ: మేడారంలో సమ్మక్క-సారక్క గద్దెలు మూసివేత - ములుగు జిల్లా లేటెస్ట్ వార్తలు
రేపటి నుంచి 21 రోజుల పాటు మేడారం సమ్మక్క-సారక్క గద్దెలను మూసివేయనున్నారు. మేడారంలో ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ: మేడారంలో సమ్మక్క-సారక్క గుడి మూసివేత