తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ చిన జాతర ప్రారంభమైంది. ఉదయం నుంచి భక్తులు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి భక్తులు తరలివచ్చారు. మాఘ శుద్ధ పౌర్ణమి మూడు రోజుల ముందే పండగను పూజారులు జరపనున్నారు.
తెలంగాణ: మేడారం చిన జాతర.. తరలివచ్చిన భక్తులు - మేడారం చిన జాతర
గిరిజను ఆరాధ్య దైవం మేడారం సమ్మక్క, సారలమ్మ చిన జాతర ప్రారంభమైంది. అమ్మవార్ల దర్శనానికి తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి భక్తులు తరలివచ్చారు.
తెలంగాణ: ప్రారంభమైన మేడారం చిన జాతర.. తరలొచ్చిన భక్తులు
ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు మినీ మేడారం జాతర జరగనుంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం గుడి ఆవరణలో భక్తులు కిక్కిరిసిపోయారు. సమ్మక్క-సారలమ్మ గుడి గేట్లు మూయటంతో బయటనుంచే మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఇచ్చే బెల్లం, పసుపు కుంకుమ, పూలు తీసుకొని గద్దె లోపల ఉన్న పూజారులు మళ్లీ భక్తులకు అందిస్తున్నారు.
ఇదీ చదవండి:మాయమైన 2.30 కిలోల బంగారం లభ్యం